సూసైడ్ చేసుకున్నానని పోలీసులు కూడా ఇంటికి వచ్చారు: నటుడు పృధ్వీ
- తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చా
- సూసైడ్ చేసుకున్నానన్న మాటను చూపించారు
- అంతా ఒకటే ఫోన్లు
- మలేషియా నుంచి కూడా ఫోన్ వచ్చింది
‘‘గతంలో ఒక తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను చెప్పిన కథ మొత్తం చూపించకుండా ‘అవును సూసైడ్ చేసుకున్నా’ అన్న మాట మాత్రమే టీవీలో చూపించారు. దాంతో ఈ వార్తలు మరిన్ని పెరిగాయి. అసలు ఏం జరిగిందంటే.. సూసైడ్‌పై నేను ఒక షార్ట్ ఫిలిం చేశా. అది చూసి నిజంగా నేను సూసైడ్ చేసుకున్నానని.. ఏకంగా పోలీసులు కూడా ఇంటికి వచ్చారు.
నాకూ, ఇంటికీ అందరూ ఒకటే ఫోన్లు. మలేషియా నుంచి కూడా ఒకమ్మాయి ఫోన్ చేసింది. ‘సర్ మీరు సూసైడ్ చేసుకున్నారా’ అనడిగితే అవునమ్మా అన్నా. ‘సర్ దయ చేసి ఆత్మహత్య చేసుకోవద్దు’ అని చెబుతూ.. ‘అవునూ, మీరు సూసైడ్ చేసుకుంటే ఎలా మాట్లాడుతున్నారు’ అని ఆశ్చర్యపోయింది. ఇక్కడ స్వర్గంలో వైఫై ఫ్రీగా పెట్టారు అనేసరికి ఠక్కున ఫోన్ పెట్టేసింది’’ అని తెలిపారు.