అమితాబ్ తో పదేళ్ల తరువాత చేస్తోన్న సినిమా ఇది: సుదీప్
- షూటింగు దశలో 'సైరా' సినిమా
- అమితాబ్ తో కలిసి నటించడం అదృష్టం
- టీమ్ కి నా ధన్యవాదాలు
తాజాగా ఈ సినిమా సెట్లో అమితాబ్ తో కలిసి తాను దిగిన ఒక ఫొటోను సుదీప్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. 'రణ్' తరువాత పదేళ్లకు ఇలా లెజెండ్ అమితాబ్ తో కలిసి తెరను పంచుకునే అదృష్టం కలిగింది. అందుకు కారకులైన రామ్ చరణ్ కి .. సురేందర్ రెడ్డికి .. ఈ సినిమా టీమ్ కి నా ధన్యవాదాలు. థ్యాంక్యూ అమితాబ్ బచ్చన్ గారూ .. మీ ప్రేమాభిమానాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి" అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.