'వేరీజ్ ద వెంకటలక్ష్మీ' నుంచి ఆకట్టుకుంటోన్న లిరికల్ వీడియో సాంగ్
- మరోసారి గ్లామరస్ పాత్రలో రాయ్ లక్ష్మి
- మనసుకి పట్టుకుంటోన్న పాటలు
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
" సమంతకి దిమ్మదిరిగే సొగసురా .. తమన్నాకి కళ్లు తిరిగే తళుకురా .. అనుపమ .. మెహరీన్ .. హన్సిక .. అదిరిపడే అందగత్తెర .." అంటూ ఈ పాట సాగుతోంది. రాయ్ లక్ష్మి సౌందర్యానికి ఆకర్షితులై ప్రవీణ్ .. మధునందన్ పాడుకునే పాటగా ఇది తెరపై ఆవిష్కరించబడుతుందని అనుకోవచ్చు.
సురేశ్ బనిశెట్టి సాహిత్యం .. హరి గౌర సంగీతం .. హరిణి - లోకేశ్వర్ - సాయిచరణ్ గానం ఆకట్టుకునేలా వున్నాయి. గ్లామర్ విషయంలో కథానాయికల ప్రత్యేకతలను చెబుతూ అల్లిన ఈ పాట చాలా బాగుంది. రాయ్ లక్ష్మి గ్లామర్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది