నయనతార సినిమాకి పెరిగిన వసూళ్లు
- తమిళంలో 'ఇమైక్కా నోడిగళ్'
- ప్రధాన పాత్రధారిగా నయనతార
- తెలుగులోను పాజిటివ్ టాక్
రాంబాబు .. ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అనువాద చిత్రాలేవీ .. ఇక్కడి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో తొలి రోజున నామ మాత్రపు వసూళ్లనే ఈ సినిమా సాధించింది. ఇదే సమయంలో థియేటర్లకు వచ్చిన మిగతా సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఈలోగా 'అంజలి సీబీఐ'కి మంచి టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఆల్రెడీ లాభాల బాట పట్టిందని చెప్పుకుంటున్నారు.