బాలయ్య సినిమాకి కల్యాణ్ రామ్ పారితోషికం తీసుకోలేదట!
- హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్
- బాబాయ్ సినిమాకే తొలి ప్రాధాన్యం
- పారితోషికం తీసుకోమన్న బాలయ్య
అలా బాలకృష్ణ సినిమాకి తొలి ప్రాధాన్యతనిస్తూ ఆయన 25 రోజుల పాటు షూటింగులో పాల్గొన్నాడట. అందువల్లనే బాలకృష్ణ .. కల్యాణ్ రామ్ ను ప్రత్యేకించి పిలిపించి పారితోషికం తీసుకోమని చెప్పారట. 'నేను నటించింది మా బాబాయ్ సినిమాలో .. పోషించింది మా నాన్నగారి పాత్ర. అలాంటప్పుడు ఈ సినిమాకి పారితోషికం ఎలా తీసుకుంటాను?' అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించాడట. బాబాయ్ బాలకృష్ణ ఎంతగా బలవంతం చేసినా కల్యాణ్ రామ్ తీసుకోలేదనే విషయాన్నే ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.