బన్నీ సినిమా కోసం రంగంలోకి దిగిన తమన్
- బన్నీతో త్రివిక్రమ్ మూవీ
- వచ్చేనెలలో సెట్స్ పైకి
- కసరత్తు మొదలెట్టిన తమన్
'అరవింద సమేత'కి తమన్ అందించిన సంగీతం, ఆ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. అందువలన త్రివిక్రమ్ మళ్లీ తమన్ కి అవకాశం ఇచ్చాడు. బన్నీకి ఏ తరహా ట్యూన్స్ కావాలో .. ఆయన నుంచి ఎలాంటి బాణీలను అభిమానులు ఆశిస్తారో తమన్ కి బాగా తెలుసు. అందువల్లనే తమన్ ఆ తరహా ట్యూన్స్ కోసం కసరత్తు మొదలు పెట్టాడట. గతంలో బన్నీ .. తమన్ కాంబినేషన్లో వచ్చిన 'రేసుగుర్రం' .. 'సరైనోడు' పాటల పరంగా మంచి మార్కులు సాధించిన సంగతి తెలిసిందే.