అత్యధిక థియేటర్లలో అజిత్ 'విశ్వాసం' విడుదల
- తమిళంలో భారీ విజయం
- 200 కోట్లకి పైగా గ్రాస్
- తెలుగులో మార్చి 1న రిలీజ్
అక్కడ ఈ సినిమా 200 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. అదే సమయంలో ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇక్కడ గట్టిపోటీ ఉండటం వలన కుదరలేదు. తెలుగులో 'విశ్వాసం' సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మాస్ ఆడియన్స్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ సినిమా, ఇక్కడ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.