సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కొత్త తరహా కథా చిత్రంలో అమలాపాల్
- ఆగస్టులో రానున్న నాని 'గ్యాంగ్ లీడర్'
- వచ్చే నెలలో నయనతార 'ఐరా'
* నాని నటిస్తున్న 24వ చిత్రానికి 'గ్యాంగ్ లీడర్' టైటిల్ని నిర్ణయించిన సంగతి విదితమే. విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రియా ఆరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.
* నయనతార తొలిసారిగా 'ఐరా' చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తోంది. సర్జున్ కేఎమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ వెర్షన్లను ఒకేసారి మార్చ్ 28న విడుదల చేయనున్నారు.