తమిళ స్టార్ హీరో జోడీగా రష్మిక మందన
- యూత్ లో రష్మికకి క్రేజ్
- చేతిలో రెండు తెలుగు సినిమాలు
- తమిళంలో కార్తి జోడీగా ఛాన్స్
ఇదే సమయంలో కోలీవుడ్ కి కూడా ఒక మంచి సినిమాతో పరిచయం కావాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తోంది. త్వరలోనే ఆమె కోరిక నెరవేరనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో కార్తి హీరోగా ఒక సినిమా చేయడానికి 'రెమో' దర్శకుడు సన్నాహాలు మొదలెట్టేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో కథానాయికగా ఆయన రష్మికను తీసుకునే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడట. కార్తి వంటి స్టార్ హీరో జోడీగా చేసే ఛాన్స్ వస్తే రష్మిక వదులుకోదు గనుక, త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు.