ఒక అవినీతిపరుడి పార్టీలో చేరి మాకు నీతులు చెబుతారా?: టీడీపీని వీడిన నేతలపై దేవినేని ఫైర్
- టీడీపీని వీడి వెళ్లే వాళ్లు వెళ్లండి
- అంతేతప్ప, బాధ్యతారాహిత్యంగా మాట్లాడొద్దు
- పార్టీ మారిన నేతలకు ప్రజలు తగినబుద్ధి చెబుతారు
అవకాశవాద రాజకీయాల కోసమే అవినీతిపరులతో చేతులు కలిపారని, ఇలాంటి వ్యక్తులు పార్టీ మారినా తమకు ఎలాంటి నష్టమూ లేదని దేవినేని అన్నారు. అవినీతి గురించి జైరమేష్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. జగన్, కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే ఫిరాయింపులు జరుగుతున్నాయని ఉమ ఆరోపించారు.