రానా .. త్రిషల ప్రేమ వ్యవహారం గురించి మళ్లీ మాట్లాడుకునేలా చేసిన ఆర్య
- గతంలో రానా .. త్రిషల ప్రేమ వ్యవహారంపై వార్తలు
- ఆ తరువాత ఏర్పడిన గ్యాప్
- మళ్లీ చేరువయ్యారనే ప్రచారం
ఇద్దరి ట్వీట్ కి ఆర్య థ్యాంక్స్ చెబుతూ .. " మీ పెళ్లి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను" అని రీ ట్వీట్ చేశాడు. దాంతో రానా .. త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం మళ్లీ పట్టాలెక్కిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆ మధ్య ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే వార్తలు వచ్చాయి. తాము డేటింగ్ కూడా చేసినట్టు ఒక ఇంటర్వ్యూలో రానా చెప్పాడు. ఎందుకనో తెలియదు గానీ ఆ తరువాత ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఇద్దరూ చేరువయ్యారనే టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది. వీళ్ల ప్రేమ కూడా పెళ్లివరకూ వెళుతుందేమో చూడాలి.