వేలూరు జైలులో ఆమరణ దీక్షకు దిగిన రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు మురుగన్, నళిని!
- 11 రోజులుగా మురుగన్ దీక్ష
- ఆరు రోజుల నుంచి ఏమీ తినని నళిని
- వెంటనే తమను విడుదల చేయాలని డిమాండ్
ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని పళనిస్వామి సర్కారు గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. గవర్నర్ వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని తమను జైలు జీవితం నుంచి విముక్తులను చేయాలని నళిని, మురుగన్ లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేంత వరకూ తమ దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.