జయరాం కేసులోకి ఎంటరైన నిర్మాత.. శిఖా చౌదరిని తప్పించేందుకేనా?
- జయరాం మేనకోడలు శిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు
- ఆమెను తప్పించేందుకు పెద్ద ఎత్తున ముడుపుల ఆశ చూపుతున్నట్టు వార్తలు
- స్టేషన్కు వచ్చి శిఖా కారును తీసుకెళ్లిన సినీ నిర్మాత
శుక్రవారం రాత్రి నందిగామలో శిఖా చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శిఖాను ఈ కేసు నుంచి తప్పించేందుకు దర్యాప్తు అధికారులకు పెద్ద ఎత్తున ముడుపుల ఆశ చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శిఖా కోసం స్టేషన్కు వచ్చిన సినీ నిర్మాత కేపీ చౌదరి ఆమె కారును తీసుకెళ్లడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమెను తప్పించేందుకే ఆయన సీన్లోకి ఎంటరైనట్టు చెబుతున్నారు. కాగా, అమెరికా నుంచి వచ్చిన జయరాం కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. జయరాం భార్య వాంగ్మూలాన్ని నమోదు చేశారు.