సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కేథరిన్
- యూత్ లో కేథరిన్ కి మంచి క్రేజ్
- విజయ్ దేవరకొండ జోడీగా ఒక సినిమా
- తొలిసారిగా లేడి ఓరియెంటెడ్ మూవీ
'ఢమరుకం' దర్శకుడు శ్రీనివాసరెడ్డి .. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా నాయిక ప్రధానంగా సాగే కథ అని సమాచారం. ఈ పాత్రకి కేథరిన్ అయితే బాగుంటుందని ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం కేథరిన్ .. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోంది.