రొమ్ము కేన్సర్‌తో పోరాడుతున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య
- తొలి దశ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న తహీరా కశ్యప్
- గుండుతో ఉన్న ఫొటోలను షేర్ చేసిన తహీరా
- అండగా బాలీవుడ్
తాజాగా, నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్‌కు కూడా కేన్సర్ సోకింది. ఆమె తొలి దశ రొమ్మ కేన్సర్ (1A) బాధపడుతోంది. ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటున్నట్టు తహీరా ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. తన కోసం ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు తెలిపింది.
తహీరా తాజాగా ట్వీట్ చేస్తూ.. గుండుతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇప్పుడు ఇలా ఉన్నానని, చాలా స్వేచ్ఛగా అనిపిస్తోందని పేర్కొంది. తాను గుండుతో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని, జుట్టు లేకపోవడం వల్ల స్నానం చేసేటప్పుడు సమస్య ఉండడం లేదని పేర్కొంది. ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. ఆమె ట్వీట్‌కు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఆమెకు మద్దతుగా ట్వీట్ చేస్తూ.. ‘ఎలా ఉన్నా నువ్వు అందంగానే ఉంటావ్’ అంటూ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అతుల్ మోహన్, ఆహనా కుర్మా తదితరులు ట్వీట్ చేశారు.