'దేవ్' నుంచి ఆకట్టుకుంటోన్న ఆడియో ఆల్బమ్
- తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన 'దేవ్'
- సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్
- వచ్చేనెల 14వ తేదీన విడుదల
'రేయ్ బావా దేవ్' .. 'షీ ఈజ్ మై గర్ల్' .. 'ఒక వందసార్లు' .. 'చెలియా' .. 'ఎటో వెళ్లినావే' .. పాటలు ఈ ఆల్బమ్ లో చోటు చేసుకున్నాయి. అన్ని పాటలను చంద్రబోస్ రాయడం విశేషం. 'ఒక వంద సార్లు' .. 'చెలియా' .. 'ఎటో వెళ్లినావే' పాటలు మరింత బాగున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాను వచ్చేనెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. గతంలో 'ఖాకీ' సినిమాతో హిట్ కొట్టిన కార్తీ .. రకుల్, ఈ సినిమాతో మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.