నేను ఆ సినిమా చేయడం లేదు: హీరో మాధవన్
- అనుష్క ప్రధాన పాత్రధారిగా 'సైలెన్స్'
- అమెరికాలో అధిక భాగం చిత్రీకరణ
- మార్చి నుంచి సెట్స్ పైకి
అనుష్క సినిమాలో తాను నటించడం లేదని అన్నాడు. ప్రస్తుతం ఏ సినిమాలోను కీ రోల్స్ చేయడానికి తాను అంగీకారాన్ని తెలపలేదని స్పష్టం చేశాడు. దాంతో ఇంతవరకూ జరిగిన ప్రచారానికి తెరపడినట్టు అయింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో మైఖేల్ మాడ్సన్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వినికిడి శక్తిలేని మూగ యువతిగా ఈ సినిమాలో అనుష్క కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మార్చి నుంచి సెట్స్ పైకి వెళుతోన్న ఈ సినిమా, అమెరికాలో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.