విజయ్ దేవరకొండకి హీరోయిన్ దొరికేసింది
- సెట్స్ పై 'డియర్ కామ్రేడ్'
- నెక్స్ట్ మూవీ క్రాంతిమాధవ్ తో
- వచ్చేనెల నుంచి షూటింగ్
కేఎస్ రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించారు. చివరికి కేథరిన్ ను ఎంచుకున్నారనేది తాజా సమాచారం. గ్లామర్ పరంగా తెలుగులో మంచి మార్కులు కొట్టేసిన కేథరిన్, 'నేనే రాజు నేనే మంత్రి' తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. క్రాంతిమాధవ్ మూవీలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం.