షూటింగ్ పూర్తిచేసుకున్న 'కాంచన 3'
- లారెన్స్ నుంచి 'కాంచన 3'
- ప్రతినాయకుడిగా కబీర్ దుహాన్
- వేసవి సెలవుల్లో విడుదల
ఈ సినిమాలో వేదిక .. నిక్కీ తంబోలి ఆయన జోడీ కట్టారు. తాజాగా ఆ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా లారెన్స్ .. వేదిక .. నిక్కీ కేక్ కట్ చేసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లారెన్స్ నిర్మాతగాను వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో 'కబీర్ దుహాన్' ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, వేసవి సెలవుల్లో తమిళ.. తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.