తెలుగులోకి అడుగుపెట్టడానికి 'విశ్వాసం' ప్రయత్నం
- తమిళనాట జనవరి 10న విడుదల
- తెలుగులో సంక్రాంతి తరువాతే
- అజిత్ సరసన నాయికగా నయనతార
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులో పెద్ద సినిమాలతో పాటు రజనీ సినిమా కూడా రంగంలోకి దిగుతోంది. థియేటర్ల సమస్య తలెత్తుతుందని తెలుగులో 'విశ్వాసం' విడుదలను వాయిదా వేసుకున్నారు. రిపబ్లిక్ డే వీకెండ్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం. ఆ దిశగానే గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా జగపతిబాబు కనిపించనున్న సంగతి తెలిసిందే.