మిస్టర్ మజ్ను నుంచి టీజర్ వచ్చేస్తోంది
- వెంకీ అట్లూరితో అఖిల్
- నాయికగా నిధి అగర్వాల్
- ఈ నెల 25వ తేదీన విడుదల
ఈ విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. జనవరి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇంతకుముందు అఖిల్ చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఆయన ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. అఖిల్ అభిమానులు కూడా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. కొత్త ఏడాది ఆరంభంలో అఖిల్ తన ఖాతాలో హిట్ ను వేసుకుంటాడేమో చూడాలి మరి.