'బ్రోచేవారెవరురా' నుంచి వెరైటీ పోస్టర్
- 'మెంటల్ మదిలో'తో మంచి పేరు
- క్రైమ్ కామెడీగా 'బ్రోచేవారెవరురా'
- శ్రీవిష్ణు సరసన ఇద్దరు కథానాయికలు
న్యూ ఇయర్లో ఎవరికీ దిష్టి తగలకుండా అందరికీ శుభమే జరగాలని కోరుకుంటూ వెరైటీగా ఈ పోస్టర్ ను వదిలారు. క్రైమ్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించనున్నారు. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది వివేక్ ఆత్రేయ చెబుతోన్న మాట.