'సైలెన్స్'లో అంధురాలి పాత్రలో అనుష్క?
- అనుష్క తాజా చిత్రంగా 'సైలెన్స్'
- అనూహ్యమైన మలుపులతో సాగే కథ
- జనవరిలో సెట్స్ పైకి
రీసెంట్ గా ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో చూపు .. వినికిడి శక్తి లేని పాత్రలో అనుష్క కనిపించనుందనేది తాజా సమాచారం. ఆమె పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అనూహ్యమైన మలుపులతో .. ఉత్కంఠభరితంగా ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. అనుష్క సరసన మాధవన్ కనిపించనున్నాడు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా, జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.