అమీర్ ఖాన్ తో తన గురించి వస్తున్న వార్తలపై ఫాతిమా సనా స్పందన
- తప్పుడు వార్తలు రాసి, ఎలా నిద్రపోగలుగుతున్నారు
- వార్తను చూసి నేను, అమ్మ ఎంతో బాధపడ్డాం
- ఈ వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తోంది
అమీర్ తో తనకు లింక్స్ ఉన్నాయనే వార్తను ఓ టీవీ చానెల్ లో ప్రసారం చేశారని... ఆ వార్తను చూసి తాను, అమ్మ ఇద్దరం చాలా బాధ పడ్డామని తెలిపింది. ఇలాంటి నిందలను చెరిపివేసుకునే బాధ్యత తమపైనే ఉంటుందని చెప్పింది. కోపాన్ని తట్టుకోలేకపోతే వార్త రాసిన వారిపై దాడి చేస్తామని... లేకపోతే సదరు వార్తపై క్లారిటీ ఇస్తామని తెలిపింది. తనకైతే ఈ తప్పుడు వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తోందని చెప్పింది.