ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవు: యామీ గౌతమ్
- 2018 పెళ్లి ముహూర్తాలతో నిండిపోయింది
- పెళ్లికి తొందరేమీ లేదు
- అప్పటి వరకూ సింగిల్గానే ఉంటా
అయితే ఇటీవల మీడియా యామీని పెళ్లి విషయమై ప్రశ్నించగా, తన వివాహానికి తొందరేమీ లేదని చెప్పింది. ‘2018లో చాలా పెళ్లిళ్లు జరిగాయి. ఇంకెన్ని జరుగుతాయి? ఇప్పటికే క్యాలెండర్ పెళ్లి ముహూర్తాలతో నిండిపోయి, మీడియాను చాలా బిజీ చేసింది. కాబట్టి దయచేసి ఇప్పుడు నన్ను వదిలేయండి. నేను సింగిల్. పెళ్లికి ముందు వరకూ నేను సింగిల్గానే ఉంటాను. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవు’ అని యామీ తెలిపింది.