అప్పులవాళ్లు రాళ్లపల్లి ఇంట్లోని సోఫాలు పట్టుకెళ్లారు: తనికెళ్ల భరణి
- రాళ్లపల్లి ఇంట్లో ఉండేవాడిని
- నాటకాలంటే ఆయనకి పిచ్చి
- గుప్తదానాలు ఎక్కువగా చేసేవారు
ఒకసారి నేను రిహార్సల్స్ చేసి బయటికి వస్తుండగా, ఆయనకి అప్పు ఇచ్చిన కొందరు ఆయన ఇంట్లోని సోఫాలు పట్టుకెళ్లిపోతూ కనిపించారు. ఆ తరువాత మా టీమ్ అంతా కలిసి ఆయన కుటుంబానికి అండగా నిలబడి ఆయనని చెన్నైకి పంపించాం. సినిమాల్లోకి వచ్చాక కూడా ఎంతో మందికి గుప్తదానాలు చేశారు. ఒకసారి ఒక షూటింగులో జూనియర్ ఆర్టిస్టులు చలికి వణుకుతుంటే, తన పారితోషికం ముందుగా అడిగి తీసుకుని 100 శాలువలు తీసుకొచ్చి వాళ్లందరికీ పంచారు. అంతటి మంచి మనసున్నవారాయన" అంటూ చెప్పుకొచ్చారు.