మరో నెగిటివ్ రోల్ కి ఓకే చెప్పిన వరలక్ష్మీ శరత్ కుమార్
- నాగేశ్వర రెడ్డి నుంచి కామెడీ ఎంటర్టైనర్
- సందీప్ కిషన్ జోడీగా హన్సిక
- హీరోయిన్ కి వదినగా వరలక్ష్మి
త్వరలో 'మారి 2' సినిమాతో పలకరించనున్న వరలక్ష్మీ శరత్ కుమార్, తొలిసారిగా తెలుగులో ఒక సినిమా చేయడానికి అంగీకరించింది .. ఆ సినిమానే 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'. సందీప్ కిషన్ కథానాయకుడిగా జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా హన్సిక నటిస్తుండగా, కీలకమైన పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కి వదినగా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేయనుందట. ఈ కామెడీ ఎంటర్టైనర్లో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.