హుషారుగా సాగిపోతోన్న 'ఎఫ్ 2' సాంగ్
- అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- జనవరి 12వ తేదీన విడుదల
'క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్టుందిరో .. 1947 ఆగస్టు 15ని నేడే చూసినట్టుందిరో' అంటూ ఈ సాంగ్ మొదలవుతోంది. 'దొరక్క దొరక్క స్వేచ్ఛ దొరికింది .. బ్యాచిలర్ లైఫ్ లోకి వెళ్లిపోదాం ..ఇలాంటి అవకాశం మళ్లీ రాదు .. రెచ్చిపోదాం బ్రదర్' అనే అర్థంలో ఈ పాట హుషారుగా సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీ యూత్ కి ఊపుని .. ఉత్సాహాన్ని ఇచ్చేలా వుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ అలరించనున్నారు.