తన ఇంటిని సీజ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్
- నందిని హిల్స్ లోని గెస్ట్ హౌస్ సీజ్
- ఆక్రమిత స్థలంలో ఉందన్న రెవెన్యూ అధికారులు
- స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాస్
రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన న్యాయవాది పిటిషన్ ను దాఖలు చేయగా, నేడు దానిని విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కాగా, సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల భూమి ప్రభుత్వ స్థలమని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా, అధికారులు ఆ స్థలంలోని అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే.