ఇక సునీల్ పొడిచేస్తాడని అన్నారు .. కానీ అలా జరగడంలేదు: కమెడియన్ పృథ్వీ సెటైర్
- ఒక్కోసారి ఒక్కొక్కరికి టైమ్ వస్తుంది
- కమెడియన్ గా నా స్థానానికి ఢోకా లేదు
- హీరోగా చేశాక కమెడియన్ ఆదరణ పొందడం కష్టం
ప్రస్తుతం ఇండస్ట్రీలో కమెడియన్ గా నా స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. కామెడీని వదిలేసి సునీల్ ఏడేళ్లపాటు హీరోగా చేశాడు .. మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా చేస్తున్నాడు. సునీల్ మళ్లీ వచ్చేస్తున్నాడనీ .. అది చేస్తాడనీ ..ఇది చేస్తాడనీ .. పొడిచేస్తాడని అన్నారు. కానీ ఈసారి ఆయన కమెడియన్ గా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాడు. ఏడేళ్లపాటు హీరోగా చేసిన తరువాత మళ్లీ కమెడియన్ గా ప్రేక్షకులు ఒప్పుకోవడం కష్టమేననేది నా అభిప్రాయం" అని ఆయన చెప్పుకొచ్చారు.