తమిళ హిట్ మూవీపై మనసు పారేసుకున్న నితిన్
- తమిళంలో విజయాన్ని అందుకున్న 'రాచ్చసన్'
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
- దర్శకుడిగా సుధీర్ వర్మ చేసే అవకాశం
విష్ణు విశాల్ .. అమలాపాల్ జంటగా తమిళంలో రామ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది తమిళంలో వచ్చిన వైవిధ్యభరితమైన సినిమాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా తెలుగు రీమేక్ లో తాను చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి నితిన్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. తెలుగులో ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తివివరాలు తెలియనున్నాయి.