రూ.18,000 చెల్లిస్తే ఇనుప ముక్క పంపారు.. సోనాక్షి సిన్హాకు షాక్ ఇచ్చిన అమెజాన్!
- బాష్ హెడ్ ఫోన్లు బుక్ చేసిన నటి
- ఇనుప బోల్టును పంపిన డీలర్
- ట్వీట్టర్ లో బయటపెట్టిన సోనాక్షి
ప్యాకింగ్ అంతా బాగానే ఉన్నప్పటికీ హెడ్ ఫోన్స్ కు బదులుగా ఇనుప బోల్టును పంపారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అమెజాన్ ప్రతినిధులకు ఫోన్ చేయగా, ఒక్కరూ సరిగా స్పందించలేదని వాపోయింది. ఈ ట్వీట్ కు అమెజాన్ కంపెనీని ట్యాగ్ చేసింది. దీంతో అమెజాన్ కంపెనీ వెంటనే స్పందించింది. జరిగిన ఘటనపై తాము విచారిస్తున్నామని తెలిపింది. ఆర్డర్ కు సంబంధించిన వివరాలను తమకు అందించాలనీ, ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.