బన్నీని మెప్పించిన త్రివిక్రమ్ .. ఫిబ్రవరి నుంచి షూటింగ్
- బన్నీ తదుపరి సినిమాకి రంగం సిద్ధం
- జనవరిలో లాంచ్ చేసేందుకు రెడీ
- లైన్లో విక్రమ్ కుమార్ .. మారుతి
దాంతో ఈ సినిమాను జనవరిలో లాంచ్ చేయడానికి రంగం సిద్ధమైపోయింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఈలోగా నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయనున్నారు. హారిక అండ్ హాసిని ... గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఈ సినిమా తరువాత బన్నీతో చేసేందుకు విక్రమ్ కుమార్ తో పాటు మారుతి కూడా సిద్ధంగా వున్నాడని అంటున్నారు.