కితకితలు పెట్టేస్తోన్న 'ఎఫ్ 2' టీజర్
- హాస్యరస ప్రధానంగా సాగే 'ఎఫ్ 2'
- పెళ్లి ప్రధానంగా సాగే కథాకథనాలు
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. కామెడీ సీన్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. "ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం .. క్రీస్తు శకం అంటాము. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు .. పెళ్లికి తరువాత" అంటూ వెంకీ చెప్పిన ఫన్నీ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతోంది. కంటెంట్ ఏమిటనేది చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ సరిపోతుంది. రఘుబాబు చెబుతున్నా వినిపించుకోకుండా వెంకీ పెళ్లి చేసుకుని కష్టాలు పడటం .. వెంకీ చెబుతున్నా వినిపించుకోకుండా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని తంటాలు పడటం చాలా ఫన్నీగా చూపించారు.