డబ్బుచుట్టూ తిరిగే కథతో 'బ్లఫ్ మాస్టర్'
- సత్యదేవ్ హీరోగా 'బ్లఫ్ మాస్టర్'
- దర్శకుడిగా గోపీగణేశ్
- ఈ నెల 28వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. "ఈ దునియాలో డబ్బున్నోడికే విలువ .. ఎంత ఎక్కువుంటే అంత విలువ .. ఎలాగైనా డబ్బును సంపాదించాలి .. ఆ తరువాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది" అని హీరో చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేదిలా వుంది. "ఈ దునియాలో బతకడానికి నింగి .. నేల .. నీరు .. నిప్పు .. గాలితో పాటు డబ్బు ఆరో భూతంలా మారిపోయింది'' అనే డైలాగ్ కూడా పేలింది.