కేసీఆర్ ఆ రెండింటికే పరిమితమయ్యారు: విజయశాంతి
- ఫాంహౌస్, ప్రగతి భవన్ లకే పరిమితమయ్యారు
- ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు
- టీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపండి
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి కార్పొరేట్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని కోరారు. భవ్య ఆనందప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఆనందప్రసాద్ మాట్లాడుతూ, అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.