తెలంగాణలో విజయం సాధించేది టీఆర్ఎస్సే: తనికెళ్ల భరణి
- యూసఫ్ గూడలో నివాసం ఉంటున్న తనికెళ్ల భరణి
- ఆయన ఇంటికి వెళ్లి కలిసిన కార్పొరేటర్ సంజయ్ గౌడ్
- కేసీఆర్ మరోసారి సీఎం అవుతారన్న భరణి
ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు జనాదరణ లభించిందని అన్నారు. భారీ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. తెలంగాణలో విజయం సాధించేది టీఆర్ఎస్సేనని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారన్న నమ్మకం ఉందని తనికెళ్ల భరణి తెలిపారు.