'మారి 2'తో రంగంలోకి దిగుతోన్న ధనుశ్
- ధనుశ్ హీరోగా 'మారి 2'
- కథానాయికగా సాయిపల్లవి
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ధనుశ్ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ధనుశ్ సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. 'మారి'ని మించిన విజయం 'మారి 2'కి దక్కుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.