నేను జ్యోతికకు పెద్ద ఫ్యాన్: మంచు లక్ష్మి
- జ్యోతిక గొప్ప నటి
- కళ్లతోనే హావభావాలు పలికిస్తుంది
- ఆమెతో నటించడం అదృష్టం
ధనుంజయన్ - గోవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాధా మోహన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ .. " జ్యోతిక మంచి నటి .. ఎలాంటి హావభావాలనైనా ఆమె తన కళ్లతోనే పలికిస్తుంది. పాత్రలో ఆమె ఒదిగిపోయే తీరు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమెతో కలిసి పనిచేయడం నా అదృష్టం అనిపించింది. ఈ సినిమాలో జ్యోతికతో కలిసి నటించిన దగ్గర నుంచి నేను ఆమెకి పెద్ద ఫ్యాన్ ను అయిపోయాను" అని చెప్పుకొచ్చింది.