త్రివిక్రమ్ ను కలిసిన ఇలియానా?
- 'అమర్ అక్బర్ ఆంటోని' చేసిన ఇలియానా
- తెలుగు సినిమాలపైనే పూర్తి దృష్టి
- అవకాశాల కోసం ప్రయత్నాలు
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె, త్రివిక్రమ్ ను కలుసుకున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. గతంలో ఆయన దర్శకత్వంలో ఇలియానా 'జల్సా'.. 'జులాయి' వంటి హిట్ సినిమాలు చేసింది. తెలుగులో మళ్లీ తన జోరు కొనసాగించాలని భావిస్తోన్న ఆమె, అవకాశాల కోసమే త్రివిక్రమ్ ను కలిసిందని అంటున్నారు. త్రివిక్రమ్ తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కి కీలకమైన పాత్రలను ఇస్తుంటాడు. రానున్న ఆయన సినిమాల్లో ఇలియానా ఆ తరహా పాత్రల్లో కనిపిస్తుందేమో చూడాలి.