తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో జత కట్టిన కొత్త పార్టీ!
- బీజేపీతో జతకట్టిన యువ తెలంగాణ పార్టీ
- యువ తెలంగాణ పార్టీని స్వాగతిస్తున్నామన్న లక్ష్మణ్
- ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఉండదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
మహాకూటమికి ప్రజాదరణ లేదని, మహా ఓటమి దిశగా ఆ కూటమి సాగుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో పట్టిన గతే ఇప్పుడు కూడా పట్టబోతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు.