సాయిధరమ్ తేజ్ తమ్ముడి సరసన నిధి అగర్వాల్
- హీరోగా వైష్ణవ్ తేజ్
- దర్శకుడిగా బుచ్చిబాబు
- త్వరలోనే షూటింగు మొదలు
సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ వున్న కారణంగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. మొత్తానికి నిధి అగర్వాల్ అక్కినేని కాంపౌండ్ లో నుంచి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిందన్న మాట.