అలా 'వర్షం' కథ వరంగల్ వైపు వెళ్లింది: పరుచూరి గోపాలకృష్ణ
- వీరూ పోట్ల 'వర్షం' కథ చెప్పాడు
- రాయలసీమ నేపథ్యంలో కథ రాసుకున్నాడు
- అప్పుడు నేను ఆ మార్పు చెప్పాను
"ఈ సినిమాకి కథను వీరూ పోట్ల అందించాడు. ఆయన ఈ సినిమాను ఫ్యాక్షన్ నేపథ్యంలో చెప్పాడు. ఈ సినిమాలో ప్రేమకథ ఎక్కువగా వుంది కాబట్టి రాయలసీమ నేపథ్యంలో కాకుండా, కాకతీయుల కాలం నుంచి ప్రాధాన్యతను సంతరించుకున్న 'ఓరుగల్లు' నేపథ్యంలో అయితే బాగుంటుంది కదా అనే అభిప్ర్రాయాన్ని వ్యక్తం చేశాను. ఈ మాట వీరుతో పాటు దర్శకనిర్మాతలకు కూడా బాగా నచ్చింది. ఇలా ఈ కథను వరంగల్ వైపు నుంచి చెప్పుకుంటూ వెళ్లడం వలన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది" అంటూ చెప్పుకొచ్చారు.