'మారి 2' నుంచి ధనుశ్ ఫస్టులుక్ వచ్చేసింది
- గతంలో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న 'మారి'
- సీక్వెల్ గా సిద్ధమైన 'మారి 2'
- డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు
ఆ సినిమాకి సీక్వెల్ గా బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే 'మారి 2' రూపొందింది. ధనుశ్ సొంత బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా నుంచి ధనుశ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. కొత్త లుక్ తో .. తనదైన స్టైల్లో యాక్షన్ కి దిగుతున్నట్టుగా ఆయన ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. డిసెంబర్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.