మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సంచలనం.. బరిలోకి మూగ, బధిర అభ్యర్థి!
- సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఎన్నికల్లోకి సుదీప్
- మధ్యప్రదేశ్‌లో సంచనాలు సర్వసాధారణం
- సుదీప్ గెలిస్తే తొలి వ్యక్తిగా రికార్డు
మధ్యప్రదేశ్ లో గతంలో యమునా ప్రసాద్ శాస్త్రి అనే అంధుడు ఎంపీగా ఎంపికయ్యారు. అలాగే, ఓ థర్డ్ జెండర్ వ్యక్తి ఎమ్మెల్యేగా, మరో థర్డ్ జెండర్ మేయర్‌గా గెలిచారు. ఇప్పుడు సుదీప్ కూడా గెలిస్తే దేశ చరిత్రలోనే అసెంబ్లీకి ఎన్నికైన తొలి మూగ, బధిర వ్యక్తిగా రికార్డులకెక్కుతాడు. సుదీప్‌కు ప్రజల నుంచి మద్దతు కూడా బాగానే లభిస్తోంది.