'వడ చెన్నై'లో ఫస్టు నైట్ సీన్ ను తొలగిస్తాం: దర్శకుడు వెట్రిమారన్
- ధనుశ్ హీరోగా వచ్చిన 'వడ చెన్నై'
- మత్స్యకారుల చుట్టూ తిరిగే కథ
- కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు
ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రాంతంలోని మత్స్యకారులు తమను .. తమ జీవన విధానాన్ని ఈ సినిమాలో నెగెటివ్ గా చూపించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే బోట్ లో జరిగే ఫస్టు నైట్ సన్నివేశం అభ్యంతరకరంగా ఉందనీ .. దానిని వెంటనే తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై దర్శకుడు వెట్రి మారన్ స్పందిస్తూ .. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకి లేదని చెప్పారు. అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న కారణంగా, వారం రోజుల్లో ఫస్టు నైట్ సీన్ ను తొలగిస్తామని అన్నారు.