మావోయిస్టు అగ్రనేత గణపతిని పట్టిస్తే రూ.15 లక్షలు.. 258 మంది ఉగ్రవాదులతో మోస్ట్ వాంటెడ్ జాబితా విడుదల
- మోస్ట్ వాంటెడ్ జాబితా విడుదల చేసిన ఎన్ఐఏ
- గణపతి, బసవరాజ్ తలలకు భారీ వెల
- జాబితాలో 15 మంది పాక్ ఉగ్ర నేతలు
పాకిస్థాన్‌కు చెందిన 15 మంది ఉగ్రవాద నేతలు కూడా ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. వీరిలో లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్, హిజ్బుల్ అగ్రనేత సలాహుద్దీన్, ఉగ్రవాదులు జకీవుర్ రెహ్మాన్, డేవిడ్ హెడ్లీ, జునైద్ అక్రమ్ మాలిక్, సాజిద్ మజిద్ తదితరులు ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వారి ఆచూకీ చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ తెలిపింది.