కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి క్రాంతి టికెట్ సంపాదించారు!: బాబూ మోహన్ ఆరోపణ
- తెలంగాణకు దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పారు
- గెలిచాక తానే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు
- టీఆర్ఎస్ భవన్ పై రాళ్లదాడి చేసినవారికే పదవులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి క్రాంతి ఆంధోల్ ఎమ్మెల్యే టికెట్ సంపాదించాడని ఆరోపించారు. టీఆర్ఎస్ లో టికెట్లు ఇస్తామన్న 105 మందిలో ఇద్దరికి టికెట్లు ఖరారు చేయలేదనీ, వారిద్దరూ ఎస్సీలేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి టికెట్ ఇవ్వకుండా సీనియర్లను అవమానిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించేందుకే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.