భారీ రేటుకు 'మహర్షి' శాటిలైట్ హక్కులు
- మహేశ్ 25వ మూవీగా 'మహర్షి'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- ఏప్రిల్ 5వ తేదీన విడుదల
ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా శాటిలైట్ హక్కులకు గట్టిపోటీ ఏర్పడింది. ఫ్యాన్సీ రేటుగా పెద్ద మొత్తం చెల్లించి శాటిలైట్ హక్కులను జెమినీ టీవీవారు సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని సదరు ఛానెల్ అధికారికంగా ధ్రువీకరించింది. అల్లరి నరేశ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు