ఆ ట్రైలర్ లో అది నా వాయిస్ కాదు .. స్పష్టం చేసిన సుధీర్ బాబు
- విడుదలకి సిద్ధంగా 'వీర భోగ వసంత రాయలు'
- తన పాత్రకి డబ్బింగ్ చెప్పని సుధీర్ బాబు
- కారణం ఏమిటనే దానిపై గుసగుసలు
మొదటి నుంచి కూడా సుధీర్ బాబు తన పాత్రలకి తానే డబ్బింగ్ చెబుతూ వస్తున్నాడు. కానీ ఆయన ఈ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పలేదు. వేరేవాళ్లు చెప్పిన డబ్బింగ్ ఆయనకి సెట్ కాలేదు. సుధీర్ బాబు మాత్రం కొన్ని కారణాల వలన ఈ సినిమాలో తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పలేదనీ, అది తన వాయిస్ కాదని స్పష్టం చేశాడు. సుధీర్ బాబు ఉద్దేశపూర్వకంగా డబ్బింగ్ చెప్పకపోవడం వల్లనే వేరేవాళ్లతో చెప్పించారని అర్థమవుతోంది. దాంతో ఈ విషయంలో ఏదో మతలబు ఉందనే గుసగుసలు జోరుగానే వినిపిస్తున్నాయి.